కులగణన డేటా పబ్లిక్ డొమైన్​లో పెడ్తం : మంత్రి పొన్నం

కులగణన డేటా పబ్లిక్ డొమైన్​లో పెడ్తం : మంత్రి పొన్నం

న్యూఢిల్లీ, వెలుగు: కులగణన సేకరణ తర్వాత పూర్తి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అనంతరం ప్రజలతో చర్చించి సామాజిక న్యాయం అమలు పరుస్తామని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం.. సంక్షేమ ఫలాలు పంచేందుకు స్కీమ్స్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని తలకటోర స్టేడియంలో  కాంగ్రెస్ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని, మాట్లాడారు.

'మేమెంతో మాకంత' అనే మాటను నిరూపించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఉపయోగపడుతుందన్నారు. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ సూచించిన కుల గణన ఐడియాను తెలంగాణ అమలు చేస్తుందని వెల్లడించారు. దీనిపై ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి కుల గణన కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 95 శాతం కుల గణన పూర్తయిందని వెల్లడించారు. తెలంగాణలో కొనసాగుతున్న కుల గణన దేశానికి దిక్సూచిగా నిలువబోతుందని పొన్నం పేర్కొన్నారు.